గోదావరి పుష్కరఘాట్‌లో అపశ్రుతి జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక జాలరి ప్రమాదవశాత్తూ పుష్కరఘాట్‌లో పడి మృతి చెందాడు.
రాజమండ్రి: గోదావరి పుష్కరఘాట్‌లో అపశ్రుతి జరిగింది. చేపల వేటకు వెళ్లిన ఒక జాలరి ప్రమాదవశాత్తూ పుష్కరఘాట్‌లో పడి మృతి చెందాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని కోటిలింగాల పుష్కరఘాట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రాజమండ్రికి చెందిన కాలపు ధనరాజ్ చేపల వేటకు వెళ్లాడు.
అయితే, పుష్కరఘాట్‌లో తవ్విన గుంతలో ప్రమాదవశాత్తూ చిక్కుకుని అతను మృతి చెందాడు. దీంతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ధనరాజ్ మృతి చెందాడని, తమకు న్యాయం చేయాలని అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
