కడప డీసీసీబీ చైర్మన్గా అనిల్ కుమార్రెడ్డి | Kadapa dccb chairman Anil kumar reddy elected | Sakshi
Sakshi News home page

కడప డీసీసీబీ చైర్మన్గా అనిల్ కుమార్రెడ్డి

May 3 2015 11:49 AM | Updated on Aug 10 2018 9:42 PM

వైఎస్ఆర్ కడప జల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) అధ్యక్షుడి ఎన్నికలను వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లు బాయ్కాట్ చేశారు.

వైఎస్ఆర్ కడప: వైఎస్ఆర్ కడప జల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) అధ్యక్షుడి ఎన్నికలను వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లు బాయ్కాట్ చేశారు. దీంతో డీసీసీబీ చైర్మన్గా టీడీపీ నాయకుడు అనిల్ కుమార్రెడ్డి ఎన్నిక ఎకగ్రీవం అయింది. టీడీపీ నేతలు అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని... ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి ఎన్నికలను బహిష్కరించినట్లు వైఎస్ఆర్ సీపీ డైరెక్టర్లు వెల్లడించారు.

చైర్మన్ పదవి టీడీపీ దక్కించుకోవడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఎ. అమర్నాథ్రెడ్డి, రాచమల్లు ప్రసాదరెడ్డి స్పందిస్తూ... బెదిరింపులు, ప్రలోభాలకు గురి చేస్తూ డీసీసీబీ చైర్మన్ పదవిని దక్కించుకోవడం అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. ఇది ఎంత మాత్రం టీడీపీ నైతిక విజయం కాదన్నారు. వైఎస్ఆర్ సీపీ వైఫల్యం అంతకంటే కాదని వారు పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement