గల్లా సమావేశానికి సినీ డెరైక్షన్ | K. Raghavendra Rao direction TDP Meeting in Guntur | Sakshi
Sakshi News home page

గల్లా సమావేశానికి సినీ డెరైక్షన్

Mar 12 2014 1:38 PM | Updated on Aug 24 2018 2:33 PM

గల్లా సమావేశానికి సినీ డెరైక్షన్ - Sakshi

గల్లా సమావేశానికి సినీ డెరైక్షన్

తెలుగుదేశం పార్టీలో చేరిన గల్లా జయదేవ్ తొలిసారిగా బుధవారం గుంటూరు వస్తున్న సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మంగళవారం ఆ ఏర్పాట్లను పరిశీలించారు.

గుంటూరు: తెలుగుదేశం పార్టీలో చేరిన గల్లా జయదేవ్ తొలిసారిగా బుధవారం గుంటూరు వస్తున్న సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మంగళవారం ఆ ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరగనున్న గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పార్టీ నాయకులు, సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నాయకులతో చర్చించారు.

ప్రకాశం బ్యారేజ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహణ, అలంకరణ, సమావేశం ఏర్పాట్లు తదితర అంశాలపై తదితర అంశాలపై రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావుతో చర్చించారు. బృందావన్ గార్డెన్స్‌లో జయదేవ్ తీసుకున్న ఇంటి వాస్తుపరిశీలించారు. అనంతరం కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్‌ను కలసి ర్యాలీకి సంబంధించిన విషయాలను వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement