'అధికార దాహం ఇంకా తీరడం లేదు' | jyothula nehru takes on tdp | Sakshi
Sakshi News home page

'అధికార దాహం ఇంకా తీరడం లేదు'

Jun 15 2015 8:27 PM | Updated on Aug 29 2018 6:26 PM

'అధికార దాహం ఇంకా తీరడం లేదు' - Sakshi

'అధికార దాహం ఇంకా తీరడం లేదు'

తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీకి తగిన సంఖ్యాబలం లేనందునే పోటీకి దూరంగా ఉంటున్నట్లు వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.

కాకినాడ: జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీకి తగిన సంఖ్యాబలం లేనందునే  పోటీకి దూరంగా ఉంటున్నట్లు  వైఎస్సార్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్  జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. టీడీపీ అధికార దాహం ఇంకా తీరడం లేదని.. బలం లేకున్నా కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు.  ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.

 

తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రాజకీయాల్లో బుడ్డోడని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.పాలమూరు ప్రాజెక్టు విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement