కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని ఆదివారం హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకర్, ఏపీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు, కర్నాటక రాష్ట్రంలోని మత్తూరు మఠం పీఠాధిపతి భోదానంద సరస్వతిస్వామిజీ దర్శించుకున్నారు.
మంత్రాలయం : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని ఆదివారం హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకర్, ఏపీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు, కర్నాటక రాష్ట్రంలోని మత్తూరు మఠం పీఠాధిపతి భోదానంద సరస్వతిస్వామిజీ దర్శించుకున్నారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి ఆశీర్వాచనాలు అందజేశారు. వీరి వెంట ఎమ్మిగనూరు జడ్జి రవిశంకర్, సీఐ నాగేశ్వరావు, ఎస్సై సునిల్‌కుమార్ తదితరులు ఉన్నారు.