ఆహ్వానం అందింది.... వచ్చాను | Junior NTR to attend Chandrababu's swearing-in | Sakshi
Sakshi News home page

ఆహ్వానం అందింది.... వచ్చాను

Jun 8 2014 11:18 AM | Updated on Sep 2 2017 8:30 AM

ఆహ్వానం అందింది.... వచ్చాను

ఆహ్వానం అందింది.... వచ్చాను

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా, టీడీపీ అధ్యక్షుడు, తన మామ చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని టాలీవుడ్ ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ అన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా, టీడీపీ అధ్యక్షుడు, తన మామ చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని టాలీవుడ్ ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ అన్నారు. మామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని  తెలిపారు. ఆదివారం ఉదయం కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని నిమ్మకూరు గ్రామానికి విచ్చేశారు.

ఈ సందర్బంగా నిమ్మకూరు గ్రామంలోని స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి జూ.ఎన్టీఆర్తోపాటు సోదరుడు కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను కలిసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిమ్మకూరు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ హాజరుకానున్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో   ఈ రోజు రాత్రి 7.27 గంటలకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement