గ్రామదేవత జాతరలో ఉద్రిక్తత | jatara in vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

గ్రామదేవత జాతరలో ఉద్రిక్తత

Feb 21 2015 2:24 PM | Updated on Sep 2 2017 9:41 PM

గ్రామదేవత జాతరలో ఉద్రిక్తత

గ్రామదేవత జాతరలో ఉద్రిక్తత

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో గ్రామదేవత జాతరలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరాయి.

బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామంలో గ్రామదేవత జాతరలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎస్సీల కుల దైవమైన అతిరి తల్లి జాతర వచ్చే నెల 2 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. అయితే ఎస్సీలు గ్రామదేవత ఘటాలను మోసేందుకు వీల్లేదంటూ బీసీలు అడ్డుచెప్పడంతో గత 15 రోజులగా గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.

దీనిపై ఎస్సీల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రసాద్ శనివారం ఉదయం గ్రామంలో పర్యటించి స్థానికులను విచారించారు. సమస్యను చర్చించుకుని పరిష్కరించుకోవాలని గ్రామ పెద్దలకు సూచించారు. గ్రామంలో పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement