విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బసగంగి గ్రామంలో ప్రజలు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.
విజయనగరం (జీఎంవలస) : విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బసగంగి గ్రామంలో ప్రజలు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. చింతలబెలగాం గ్రామంలో తమకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ వారు ఆదివారం జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పలుచోట్ల జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకుంటుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.