ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Intermediate Student attempts suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Aug 22 2015 8:30 PM | Updated on Sep 3 2017 7:56 AM

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది.

బొబ్బిలి (విజయనగరం) : ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని తిరుగుడి వీధికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ రెండో ఏడాది చదువుతోంది. కాగా తాను చదివే కాలేజీలోని ఓ లెక్చరర్ పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ పేరుతో ఆమె వెంట తిరిగాడు. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె ఇంట్లోని టాయిలెట్ క్లీనర్ హార్పిక్ తాగి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement