నేటి నుంచి ఇంటర్ పరీక్షలు | Inter exams from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

Mar 11 2015 6:55 AM | Updated on Sep 26 2018 3:25 PM

ఇంటర్మీడియెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది.

విశాఖపట్నం: ఇంటర్మీడియెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 9గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రశ్నపత్రం విద్యార్థుల చేతిల్లో ఉంటుంది. ఎలాంటి  ప్రశ్నలు వస్తాయోనని విద్యార్థుల ఆందోళన. ఏర్పాట్లల్లో లోపాలేమన్నా ఉన్నాయేమోనని అధికారులు ఆందోళనల మధ్య పరీక్ష ప్రారంభం కానుంది. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటకీ నిర్వహణలో లోపాలు  ఏటా వెలుగుచూస్తున్నాయి. జిల్లాలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కొరత వెంటాడుతుంది. రవాణ సమస్యల వల్ల ఏజెన్సీ, రూరల్  క ళాశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయినా కళాశాల యాజామాన్యాల బాధ్యతరాహిత్యంతో నేల పరీక్షలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది నేలబారు పరీక్షలు ఉండకూడదని అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. అవసరమైతే పరీక్ష కేంద్రాల్లో అద్దె ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.        
 
జిల్లాలోని 111 పరీక్షకేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం నుంచి 50,279 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జనరల్ కోర్సు నుంచి 46,552 మంది, ఒకేషనల్ నుంచి 3,427 మంది పరీక్షలు రాయనున్నారు.  వీరిలో బాలికలు  24,040,  బాలురు  25,373 మంది ఉన్నారు. ఏజెన్సీలోని సమస్యాత్మకమైన కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ కేంద్రం వద్ద జీపీఎస్ పాయింట్లు ఏర్పాటు చేశారు. టెక్నాలజీ మాస్‌కాపీయింగ్‌ను అరికట్టడానికి ఈ జీపీఎస్ సిస్టమ్‌వినియోగిస్తున్నారు. అలాగే పరీక్షల పర్యవేక్షణకు అయిదు సిట్టంగ్ స్క్వాడ్, నాలుగు ఫై ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించారు. వీరితో పాటు రెవిన్యూ, ఆర్‌ఐవో, డీవీఈవో, ఆర్జేడీ అబ్జర్వ్ బందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి.

 

8గంటలకే చేరుకోవాలి.. :
ఇంటర్ విద్యార్థులు ఉదయం 8గంటలకే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి. హాల్‌టికెట్ మరిచిపోకుండా తప్పనిసరిగా తమ వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు ఉండాలి. ముందుగా  విద్యార్థి హాల్‌టికెట్ న ంబర్‌కు కేటయించిన గదిని వెతకాలి. పరీక్షగదికి వెళ్లి అక్కడ విద్యార్థి నంబర్ ఉందోలేదో పరిశీలించి లేకపోతే వెంటనే చీఫ్ సూపరింటెండెంట్ లేదా డిపార్ట్‌మెంట్ అధికారులను సంప్రదించి తెలుసుకోవాలి. పరీక్షాగదిలో ఓఎంఆర్ సీట్‌ను జాగ్రత్తగా పూరించాలి. ఆన్సర్‌సీట్ తనిఖీ చేసి 25 పేజీలుంటే జవాబులు రాయాలి. ప్రశ్నాపత్రం ఒకటికి రెండుధపాలు పరిశీలించి పరీక్ష రాయాలి.
 

పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు...
ఇంటర్మీడియట్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేశాం. చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించాం. ఇన్విజిలేటర్లతో సమావేశమై బోర్డు నిర్దేశించిన ఆదేశాల గురించి చర్చించాలని ఆదేశాలు జారీ చేశాం.  పరీక్షగదిలోకి సెల్‌ఫోన్లు ఇతర ఎలాక్ట్రినిక్ వస్తువులు ఎవరు తీసుకెళ్లిన చర్యలు తీసుకుంటాం. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశాం. ఫర్నిచర్ కొరత ఉన్న పరీక్షాకేంద్రాలకు అద్దె కుర్చీలు వేయాలని సూచించాం. విద్యార్థులకు కేంద్రాలకు చేరుకునేలా బస్‌లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులకు కోరాం. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసే విదంగా చర్యలు తీసుకున్నాం. మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా చర్యలు తీసుకున్నాం. జీపీఎస్ సిస్టం కూడా అమలు చేశాం. పరీక్షాకేంద్రాల ప్రధాన గేటు వద్దే విద్యార్థులకు తనిఖీలు నిర్వహించి పరీక్ష గ దిలోకి అనుమతి ఇవ్వాలని ఆదేశించాము. కాబట్టి విద్యార్థులు 8గంటలకు కేంద్రాలకు చేరుకోవాలి. స్లిప్పులు, ముబైల్ ఫోన్లు తీసుకొచ్చిన విద్యార్థులను డిబార్ చేస్తాం. సమస్యాత్మక కేంద్రాల్లో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాం.  - ఎల్‌జె జయశ్రీ. ఆర్‌ఐవో
 


సమస్య ఉంటే కంట్రోల్ రూం
పరీక్షాకేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా బోర్డు కార్యాలయంలో కంట్రోల్‌రూమ్‌కు తెలియజేయాలి. డెక్ కన్వీనర్ల పేరుతో త్రిమెన్ కమిటీ ఇక్కడ విధులు నిర్వహిస్తుంది. హాల్ టికెట్లు అందకపోయినా, హాల్‌టికెట్లల్లో తప్పులు పడిన, పరీక్షహాల్లోకి అనుమతి ఇవ్వకపోయినా వెంటనే డెక్ కన్వీనర్లకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారు. డెక్ కన్వీనర్లు పి.విలాసమూర్తి-94405 20773, బి.సుజాత-94909 43643, ఉగాదినాయుడు-9985050830 ఫోన్ నంబర్‌లలో సంప్రదించాలి.
 

సిటీ బస్సులు రెడీ
ఇంటర్మీడి యెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం బుధవారం నుంచి ఆర్టీసీ సిటీ బస్సులను సిద్ధం చేశారు.  ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలకు జరగనున్నాయి. విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 7.45 గంటల నుంచి ప్రతి బస్‌స్టాప్ వద్ద బస్సులు ఏర్పాటు చేస్తున్నామని విశాఖ రీజయన్ చీఫ్ ట్రాఫిక్ డిప్యూటీ మేనేజర్ (అర్బన్) ఎ.వీరయ్యచౌదరి తెలిపారు. విశాఖలోని 104 సెంటర్లకు బస్ సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement