కొమ్మాదిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి | Integrated sports academy in kommadi village, says SAAP chairman PR Mohan | Sakshi
Sakshi News home page

కొమ్మాదిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి

Jun 24 2015 1:40 PM | Updated on Sep 3 2017 4:18 AM

ఇకపై తమ సంస్థ ద్వారా జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్ని తెలుగులోనే జరుగుతాయని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ వెల్లడించారు.

విశాఖపట్నం: ఇకపై తమ సంస్థ ద్వారా జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలన్ని తెలుగులోనే జరుగుతాయని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో ప్రభుత్వ అతిథి గృహంలో శాప్ 3వ సమావేశంలో పీఆర్ మోహన్ మాట్లాడారు. వ్యాయామ విద్య నిర్బంధ విద్యగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కొమ్మాదిలో రూ. 15 కోట్ల కేంద్ర నిధులతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మూత పడిన స్పోర్ట్స్ అకాడమీలను పునః ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారుల సాయంతో ఏపీ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement