మండిపడ్డ సూరీడు | Sakshi
Sakshi News home page

మండిపడ్డ సూరీడు

Published Sat, Aug 9 2014 1:05 AM

మండిపడ్డ సూరీడు

  • సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం
  •  మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి!
  • సాక్షి, విశాఖపట్నం : వర్షాకాలం వచ్చినా ఉష్ణోగ్రతల తీవ్రత మాత్రం తగ్గుముఖం పట్టలేదు. పగటిపూట బయటికెళ్లేందుకు భయపడే పరిస్థితి మళ్లీ నెలకొంది. శుక్రవారం ఎండ వేడికి తీవ్ర ఉక్కబోత తోడై జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా 37.2 డిగ్రీలు నమోదయింది. వాతావరణంలో తేమ కూడా 69 నుంచి 72 శాతంగా ఉంది. దీంతో శరీరం జిడ్డుబారి జిల్లావాసులు అవస్థలు  పడ్డారు. వేసవి తర్వాత ఈ మధ్య కాలంలో ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే ప్రథమమని వాతావరణ నిఫుణులు చెబున్నారు.

    గతేడాది ఈ సమయానికే రుతుపవనాలు చురుగ్గా ఉండి, భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రుతుపవనాల ప్రభావం పూర్తిగా ఆంధ్రపై లేకపోవడం, అల్పపీడనం, వాయుగుండాలు కూడా రాష్ట్రంపై కరుణ చూపకపోవడం ఉష్ణతీవ్రతకు కారణమని నిపుణులు తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. అల్పపీడనాలు ముఖం చాటేయడంతో రైతుల కష్టాలు ప్రారంభమయ్యాయి. కార్తెలన్నీ అవిరైనా సేద్యం మాత్రం కదలడం లేదు.
     

Advertisement
 
Advertisement
 
Advertisement