ముళ్ల కంపల్లో పసిపాప | Infant girl found in bushes | Sakshi
Sakshi News home page

ముళ్ల కంపల్లో పసిపాప

Nov 6 2015 7:58 PM | Updated on Sep 3 2017 12:08 PM

రోజుల వయసున్న ఆడ శిశువును అమానుషంగా కంప చెట్లలో వదిలేసి వెళ్లారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని వంతనె సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.

పెద్ద దోర్నాల (ప్రకాశం జిల్లా) : రోజుల వయసున్న ఆడ శిశువును అమానుషంగా కంప చెట్లలో వదిలేసి వెళ్లారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని వంతనె సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. ముళ్లు గుచ్చుకుని పసిపాప ఏడవడంతో స్థానికులు చూసి పాలు పట్టించి ఎస్‌ఐ నాగరాజుకు విషయం తెలియజేశారు. ఆయన వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మొత్తానికి స్థానికుల చొరవతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement