విజయవాడ నగరంలో నిర్మింత కానున్న మెట్రో ప్రాజెక్ట్‌కు రామవరప్పాడులో 60 ఎకరాలలో భారీ షెడ్ నిర్మించేందుకు సన్నాహాలు
2018 నుంచి షెడ్డుకు నాలుగు మెగావాట్లు
రాజీవ్‌గాంధీ పార్క్ సమీపంలో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్
పలుచోట్ల మెట్రోకు తాత్కాలిక షెడ్ల ఏర్పాటుకు సన్నాహాలు
విజయవాడ నగరంలో నిర్మింత కానున్న మెట్రో ప్రాజెక్ట్‌కు రామవరప్పాడులో 60 ఎకరాలలో భారీ షెడ్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొద్దినెలల్లో మొదలుకానున్నాయి. ఇప్పటికే మెట్రో ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ ఖరారు చేసి రెండు కారిడార్లుగా విభజించి రెండు దశల్లో పనులు చేయాలని మెట్రో ఆధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈఏడాదిలో మొదలుపెట్టి 2019 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి మే-జూన్ మాసాలలో ట్రయల్ రన్ నిర్వహించి తదనంతరం మార్పులు చేర్పులు చేసి ఆగస్టు ఒకటి నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. పెనమాలూరు నుంచి మొదలై బెంజిసర్కిల్ మీదుగా బందరు రోడ్డులో బస్టాండు వరకు 13 కిలోమీటర్లు మేర మొదటి కారిడార్ పనులు జరుగుతాయి. ఇది 2016 నాటికి పూర్తి కావాల్సి ఉంది. రెండో కారిడార్‌లో నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, గుణదల, ఏలూరురోడ్డు, అలంకార్, రైల్వేస్టేషన్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, పోలీసు కంట్రోల్‌రూం, ఫైర్‌స్టేషన్ మీదుగా బస్టాండు వరకు 13 కిలోమీటర్లు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈక్రమంలో మెట్రో గూడ్స్ వ్యాగిన్, వర్క్‌షాప్‌ను రామవరప్పాడు రింగ్ సమీపంలో 60 ఏకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయటానికి అన్ని ఏర్పాటు చేస్తున్నారు.
మెట్రో ప్రాజెక్ట్‌కు
సంబంధించి అన్ని పనులు, కోచ్‌ల నిర్మాణం, ఇతర ఇంజనీరింగ్ పనులు అన్ని అక్కడే జరగనున్నాయి. మెట్రో పనుల సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలను గుర్తించి వాటి ద్వారా పనులు జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. మొదటి కారిడార్‌లో రాఘవయ్య పార్క్ సెంటర్, డివి మ్యానర్, బెంజ్ సర్కిల్ రెండో కారిడార్ పరిధిలోకి వచ్చే బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్, ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ సెంటర్‌లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసి పనులు జరపనున్నారు.
విద్యుత్ శాఖకు ఇచ్చిన ప్రతిపాదనలు
ఆరు తాత్కాలిక షెడ్డులకు కాంట్రాక్టర్ డిమాండ్‌కు అనుగుణంగా పనుల దశకు, అవసరానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలి. పనులు మొదలయ్యాక శాశ్వత రీతిలో మెట్రో అవసరాలకు రాజీవ్‌గాంధీ పార్క్ సమీపంలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను మెట్రోనే నిర్మించనుంది. పూర్తి మెట్రో ప్రాజెక్ట్‌కు విద్యుత్ సరఫరా దాని నుంచి చేసేలా విద్యుత్ కేటాయింపులు చేయాలి. ప్రస్తుతం నగరంలో విద్యుత్ వాడకం రోజుకి 2ఎంఎల్‌గా ఉంటుంది. 2019 నుంచి మెట్రో అందుబాటులోకి వస్తే దానితో కలిపి 6ఎంఎల్‌గా ఉంటుంది. రానున్న రోజుల్లో విద్యుత్ కోటా పెంచుకుంటూ ఉండాలి. రామవరప్పాడులో షెడ్డు నిర్మాణం పనులకు సాధారణ రోజుల్లో 100 కిలోవాట్స్ విద్యుత్ వినియోగం ఆ తర్వాత 2016 నుంచి పనులు పూర్తి అయ్యే వరకు రోజుకి 23 నుంచి 4 మిలియన్ వాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఆరు తాత్కాలిక షెడ్డుకు రోజుకి 50 నుంచి 100 కేవీ విద్యుత్ సరఫరా అవసరం అవుతుంది. ప్రాథమికంగా రెండు రహదారుల్లో సుమారు 150 విద్యుత్ వైర్లు క్రాసింగ్ ఉన్నాయని వాటిని మెట్రో ఖర్చుతో విద్యుత్ శాఖ తొలగించుకోవాల్సిందిగా సూచించారు. రెండు ప్రధాన రహదారుల్లో ఉన్న విద్యుత్ లైన్ కూడ 18 మీటర్ల ఎత్తులో ఏర్పాటుచేయటం లేక అండర్ గ్రౌండ్‌కేబుల్ ద్వారా వేసే అంశాన్ని పరిశీలిస్తారు.