బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం! | IMD warns depression in coastal andhra | Sakshi
Sakshi News home page

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం!

Nov 4 2014 9:12 AM | Updated on Sep 2 2017 3:51 PM

అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) విశాఖపట్నం శాఖ వెల్లడించింది

విశాఖపట్నం: అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల అవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) విశాఖపట్నం శాఖ వెల్లడించింది. ఉపరితల అవర్తనం మరింత బలపడి ఆగ్రేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 
 
నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల అవర్తనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. కోస్తా తీర ప్రాంతాల్లో రేపటి వరకు వాతావరణం పొడిగానే ఉంటుందని తమ రిపోర్టులో ఐఎండీ పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement