ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు.
మున్సిపల్ స్కూళ్లలో 24 నుంచి శ్రీకారం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉన్నత విద్యావంతుల ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు.
ఆదివారం చిత్తూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి మున్సిపల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. మున్సిపల్ పాఠశాలలకు, విద్యాశాఖకు సమన్వయం లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. ఇక నుంచి మున్సిపల్ పాఠశాలల పూర్తి బాధ్యత కమిషనర్లదేనన్నారు.