నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు | I did not favorite role :Junior Relangi | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు

Jul 6 2014 12:21 AM | Updated on Sep 2 2017 9:51 AM

నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు

నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు

ఇప్పటి వరకు దాదాపు 350 పాత్రలు పోషించాను. నాకు నచ్చిన పాత్ర ఇప్పటి వరకూ లభించలేదని జూనియర్ రేలంగి అన్నారు. వ్యక్తగత కార్యక్రమంపై శనివారం రాజమండ్రి

 రాజమండ్రి కల్చరల్ :ఇప్పటి వరకు దాదాపు 350 పాత్రలు పోషించాను. నాకు నచ్చిన పాత్ర ఇప్పటి వరకూ లభించలేదని జూనియర్ రేలంగి అన్నారు. వ్యక్తగత కార్యక్రమంపై శనివారం రాజమండ్రి వచ్చిన ఆయనతో చిట్‌చాట్...
 
 నాటితరం మేటి హాస్యనటుడు రేలంగితో పోలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు.?
 ఇది నా అదృష్టంగా భావిస్తాను. ఆ అర్హత ఉందా అనిపిస్తోంది.రేలంగి నా అభిమాన నటుడు.
 
  నాటికీ నేటికీ హాస్యంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
 హాస్యం నాడు కథలో అంతర్భాగంగా ఉండేది. సున్నితంగా ఉండేది. నేడు కూడా కమెడియన్ లేని సినిమా ఉండవచ్చు, కానీ హాస్యం లేకుండా సినిమా ఉండదు. హీరోలు కూడా కామెడీ చేయడానికి ఇష్టపడుతున్నారు. నాటి హాస్యం మళ్లీ తెరపై ఎప్పటికయినా కనిపిస్తుందని ఎదురుచూస్తున్నాను.
 
  మీకు నచ్చిన పాత్ర ఏది?
 ఇన్ని సినిమాల్లో నటించాను కానీ ఏ పాత్ర అంతగా తృప్తినివ్వలేదు. సున్నితంతో కూడిన హాస్య పాత్ర పోషించాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
 
 మీ వ్యక్తిగత వివరాలు చెబుతారా?
  నాది ఈ జిల్లానే. రాజోలు మండలం కడలి స్వగ్రామం. బి.కాం, ఎల్.ఎల్.బి చదివాను. నటనపై ఆసక్తితో ఈ రంగానికి వచ్చాను. నా పూర్తి పేరు కాశీభొట్ల సత్యప్రసాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement