ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు | Hyderabad High Court Issues Notices AP Government Over SC ST Commission Election | Sakshi
Sakshi News home page

Oct 5 2018 1:33 PM | Updated on Oct 5 2018 2:19 PM

Hyderabad High Court Issues Notices AP Government Over SC ST Commission Election - Sakshi

నియామక పక్రియకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నియామకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నియామకంపై ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు జారీచేసింది. ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా కారెం శివాజీని నియమించిన సంగతి తెలిసిందే. కమిషన్‌ చైర్మన్‌గా శివాజీ ఎన్నిక చెల్లదంటూ న్యాయవాది హరిప్రసాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో శివాజీ ఎంపిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించిన ఏపీ ప్రభుత్వం శివాజీని తిరిగి కమిషన్‌ చైర్మన్‌గా నియమించడంపై ఆయన కంటెమ్ట్‌ ఆఫ్‌ కోర్టు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా కమిషన్‌ చైర్మన్‌ నియామక పక్రియకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అక్టోబర్‌ 31న కారెం శివాజీ నేరుగా కోర్టుకు హాజరుకావాలని కూడా ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement