జననేతకు నీరాజనం పలికిన లక్కవరపుకోట

Huge Response On Ys Jagan Padayatra In Srungavarapukota - Sakshi

సాక్షి, ఎస్‌.కోట(విజయనగరం): ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 271వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎస్‌. కోట అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి సొంత ఊరు లక్కవరపుకోటలో జననేతకు జననీరాజనం పలికారు. అడుగడుగున్న హారతులతో స్వాగతం మహిళలు స్వాగతం పలికారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. 

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు కలిశారు. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని జననేతకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో.. ఉద్యోగులు జననేతకు కృతజ్ఞతలు తెలపారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఐదు లక్షల మంది రాజన్నబిడ్డ వెంట ఉంటామని స్పష్టం చేశారు.  అభిమాన నాయకుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడగా... వారందరితో జననేత ఆత్మీయంగా చిరునవ్వులు చిందిస్తూ  సెల్ఫీలకు సహకరించారు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి జగన్ ను కలుసుకున్నారు.  వైఎస్‌. జగన్ ప్రజా సంకల్పయాత్రకు వీరిద్దరూ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ వీరితో కొద్దిసేపు ముచ్చటించారు.

చదవండి:

చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.

నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top