ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
సాక్షి, విజయవాడ బ్యూరో/ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారం దక్కగానే భూముల పిచ్చి పట్టుకుందని, దానికి రైతులను బలిచేయడమే కాకుండా ప్రభుత్వ భూములను సైతం ధారాదత్తం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం త్రిలోచనాపురంలో ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీవాసుదేవ్‌కు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న భూములను రామకృష్ణ నేతృత్వంలోని సీపీఐ ప్రతినిధి బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వాసుదేవ్ కోసం 400 ఎకరాలు సేకరించేందుకు బాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్నారు.