క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతోనే రోగులు మృత్యువాత పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిల్లి సాంబశివరావు అన్నారు.
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతోనే రోగులు మృత్యువాత పడుతున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిల్లి సాంబశివరావు అన్నారు. వరంగల్ నగరంలోని సాయిశ్రీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ, సదస్సును గురువారం నిర్వహించారు. ర్యాలీ పోచమ్మమైదాన్ నుంచి ప్రారంభమై ఎంజీఎం వరకు కొనసాగింది. అనంతరం ఐఎంఏ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా సాంబశివరావు హాజరై మాట్లాడారు. రొమ్ములో చిన్న గడ్డలు, నీరు, రక్తం గడ్డ కట్టడం ద్వారా రొమ్ము పరిమాణం చిన్నగా, పెద్దగా మారుతుందని అన్నారు. ఇలాంటి మార్పులు కనబడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతీ 8 మందిలో ఒకరు రొమ్ము క్యాన్సర్‌తో చనిపోతున్నారని, దీనికి కారణం ప్రజలకు అవగాహన లేకపోవడమేనని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వర్షాకాలంలో కాచి చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ అవినాష్ తిప్పని మాట్లాడుతూ 40 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరు రొమ్మును ఎక్స్‌రే తీయించుకోవాలన్నారు. మొదటి స్థాయిలో రొమ్ము క్యాన్సర్‌ను నిర్ధారించి నివారించవచ్చన్నారు. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించగలిగితే రొమ్ము మొత్తం తీయకుండా సర్జరీ చేయవచ్చని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఐఎంఏ నాయకులు డాక్టర్ కంకల మల్లేశం, యైశ్రీధర్‌రాజు, ఎన్‌ఎంఏ జిల్లా ప్రధాన కార్యద ర్శి వలబోజు మోహన్‌రావు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఏకశిల అధ్యక్షుడు మదన్, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు ప్రభాకర్, వంగిరి సూర్యనారాయణ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.