అనంతపురం రూరల్ : అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పది రోజుల వయసున్న పాప గుక్కపట్టి ఏడుస్తోంది.. ఎవరీ పాప అని ఆరా తీస్తే ఎవరూ ముందుకు రాలేదు.
అనంతపురం రూరల్ : అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పది రోజుల వయసున్న పాప గుక్కపట్టి ఏడుస్తోంది.. ఎవరీ పాప అని ఆరా తీస్తే ఎవరూ ముందుకు రాలేదు. పోస్టునేటల్ వార్డులో 3వ నంబర్ మంచంలో శుక్రవారం సాయంత్రం ఓ పాపను వదిలేసి వెళ్లారు. అసలు పోస్టునేటల్ వార్డులోనే ఆ పసికందును ఎందుకు వదిలేసి వెళ్లారో అర్థం కావడం లేదు.
నిత్యం రద్దీగా ఉండే వార్డులో బయటి వ్యక్తులు వచ్చి పాపను వదిలి వెళ్లే అవకాశమే ఉండదు. ఆ యూనిట్ బాలింతలు, వారి బంధువులతో కిటకిటలాడుతుంటుంది. అటువంటిది ఆ వార్డులో బయటి వ్యక్తులు ఏవిధంగా వచ్చారో అర్థం కావడం లేదు. అడ్మిషన్‌లో ఉండే ఎవరైనా వదిలి వెళ్లారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్ల కావడంతో వదిలేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.
వార్డులోని నర్సులు విషయాన్ని గైనిక్ హెచ్‌ఓడీకి తెలిపారు. పాపను ఎస్‌సీఎన్‌యూలో ఉంచాలని వైద్యులు ఆదేశించారు. బేబికి 10 నుంచి 15 రోజుల వయసు ఉండవచ్చని, ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఆస్పత్రిలో పాల కోసం పాప అల్లాడిపోయింది. అక్కడున్న స్టాఫ్‌నర్సులే డబ్బా పాలనందించారు. టూటౌన్ పోలీసులు పసికందు గురించి ఆరా తీశారు. కే షీట్లను పరిశీలించారు. ఎస్‌ఎన్‌సీయూ, పోస్టునేటల్, లేబర్ వార్డులలోని సిబ్బందిని ప్రశ్నించారు.