ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌

Published Tue, Aug 29 2017 2:13 PM

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల ఉపసంహరణపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా 278మందిపై కేసులు ఉపసంహరిస్తూ చంద్రబాబు సర్కార్‌ 132 జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. కేసుల ఉపసంహరించినవారి  జాబితాలో స్పీకర్‌, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు, టీడీపీ నేతలు ఉన్నారు.

కాగా చంద్రబాబు సర్కార్‌ దొడ్డి దారిన జీఓలు విడుదల చేసి టీడీపీ నేతలపై ఉన్న కేసులు రద్దు చేయడంపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై కేసులను  ఉపసంహరిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను ఆయన న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీఓలను కొట్టేయాలని ఆర్కే పిటీషన్‌లో కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement