హెల్మెట్ ఉండాల్సిందే! | Helmets compulsory | Sakshi
Sakshi News home page

హెల్మెట్ ఉండాల్సిందే!

May 18 2015 5:00 AM | Updated on Sep 3 2017 2:14 AM

ద్విచక్ర వాహనదారులు ఇకపై రోడ్డెక్కితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. జూలై 1 నుంచి జిల్లాలోని అన్ని పట్టణాల్లో...

జూలై 1 నుంచి అన్ని పట్టణాల్లో అమలు
పోలీసు, రవాణా శాఖకు ఆదేశాలు
జిల్లాలో ద్విచక్ర వాహనాలు 3,75,000

 
  కర్నూలు : ద్విచక్ర వాహనదారులు ఇకపై రోడ్డెక్కితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. జూలై 1 నుంచి జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఈ విధానం తప్పకుండా అమలు చేయాలని పోలీసు రవాణా శాఖలకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో కలసి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారులు పట్టణాలు నగర పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగిన వైనం చర్చకు వచ్చింది.

ప్రమాదాల్లో ద్విచక్ర వాహన దారుల మరణాల శాతాన్ని తగ్గితంచేందుకు జూలై 1 నుంచి హెల్మెట్ తప్పనిసరి చేయాలని డీజీపీ ఆదేశించారు. హెల్మెట్ వినియోగం ఆవశ్యకతపై తక్షణమే ప్రజల్లో ముమ్మర ప్రచారంతో చైతన్యం పెంపొందించేందుకు జిల్లా ట్రాఫిక్ పోలీసులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. జిల్లాలో 3,75,000 ద్విచక్రవాహనాలు ఉన్నాయి. కర్నూలు కార్పొరేషన్‌తో పాటు ఆదోని, నంద్యాల, ఆత్మకూరు, డోన్, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాల్లో హెల్మెట్ రూల్ వచ్చేస్తుంది. దీనికి తోడు నెలలో 5 రోజులు పోలీసు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా రోడ్డు భద్రతా తనిఖీలు చేపట్టనున్నారు.

  డ్రంకెన్ డ్రైవ్‌లో పదేపదే దొరికితే లెసైన్స్ రద్దు
 తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే ఇప్పటివరకు జరిమానా, జైలుకు పంపుతున్నారు. ఇకపై పదేపదే ట్రాఫిక్ పోలీసులకు దొరికినవారి లెసైన్సులను రద్దు చేయాలని రవాణా శాఖ యోచిస్తోంది. నగరంలో ప్రతిరోజూ 20 నుంచి 40 మంది దాకా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్నారు. గత రెండేళ్లుగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 956 డ్రంకన్‌డ్రైవ్ కేసులు నమోదు కాగా, దాదాపు రూ. 11 లక్షల జరిమానా విధించారు.

ఇప్పటికే వంద మందికి పైగా రెండు, మూడు రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఎక్కువ భాగం ద్విచక్ర వాహనదారులే డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడుతున్నారు. జరిమానా, జైలు శిక్ష పడుతున్నా సరే పరిస్థితిలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదు. దీంతో తొలుత డ్రైవింగ్ లెసైన్స్‌లు సస్పెండ్ చేయాలని అధికారులు భావి స్తున్నారు. ఒకసారి రద్దు చేసిన తర్వాత మళ్లీ పొందేందుకు వీలు కాదు. జీవితాంతం వాహనాలు నడిపే అర్హతను సదరు వ్యక్తి కోల్పోతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement