రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు | Heavy rains in coastal and telangana with in 24 hours | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Aug 30 2014 11:05 AM | Updated on Sep 2 2017 12:38 PM

ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది.

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఆ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం లేదని అయితే అల్పపీడనం భూమిపైకి చేరుకుని క్రమేణా బలహీనపడుతుందని తెలిపింది.

రాగల 24 గంటల్లో కోస్తా, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement