
సాక్షి, విశాఖపట్టణం : నగరంలో భారీ వర్షం కురిసింది. గత నాలుగైదు రోజులుగా తీక్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడిన విశాఖ ప్రజలను ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం ఊరటనిచ్చింది. అక్కయ్య పాలెం, దొండపర్తి, లలితా నగర్, మధురా నగర్, శంకరమఠం, సీతమ్మధార, మురళినగర్, మాధవధార ప్రాంతాలలో గంటకు పైగా వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.