నదిలో మునిగిపోతున్న ఎమ్మెల్యేను గన్‌మన్ రక్షించాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో ఆదివారం జరిగింది.
జగ్గయ్యపేట, న్యూస్‌లైన్: నదిలో మునిగిపోతున్న ఎమ్మెల్యేను గన్‌మన్ రక్షించాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో ఆదివారం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండిఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు కుటుంబసభ్యులతో కలసి వేదాద్రిలోని శ్రీయోగానంద లక్ష్మీనరసింహా స్వామి సన్నిధికి వచ్చారు.
కృష్ణానదిలో ఉన్న సాలగ్రహ నరసింహాస్వామి (నామాలు) వద్దకు నీటిలో ఈదుకుంటూ వెళ్లారు. స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న గన్‌మన్ గమనించి నదిలోకి దూకి ఎమ్మెల్యేను రక్షించాడు.