రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు | Grant funding for road construction | Sakshi
Sakshi News home page

రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు

Apr 2 2016 4:09 AM | Updated on Sep 5 2018 8:24 PM

రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు - Sakshi

రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరు

కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు గూడూరు ఎమ్మెల్యే పాశం...

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్

చిట్టమూరు: కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండల పరిధిలోని గునపాటిపాళెం నుంచి ఉప్పలమర్తి మీదుగా కొత్త చెరువుకట్ట  లింకు రోడ్డు వరకు 3.8 కిలోమీటర్లకు గాను రూ.3.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. కోట మండ లం తిన్నెలపూడి పంచాయతీ లక్ష్మక్కకండ్రిగ నుంచి తూర్పుకండ్రిగ వరకు బీటీ రోడ్డుకు రూ.81 లక్షలు విడులయ్యాయన్నారు. ఉపాధిహామీ పథకంలో పనులు చేపడుతారని పేర్కొన్నారు. చిట్టమూరు మండలంలో ఎస్‌టీపీ ద్వారా మెట్టు గిరిజన కాలనీ నుంచి జంగాలపల్లి బ్రిడ్జి వరకు నిర్మించే రోడ్డుకు రూ.1.18 కోట్లు మంజూరయ్యాయన్నారు.

గొల్లపాళెం నుంచి కోటిగుంట గిరిజన కాలనీ వరకు రూ.34 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మె ల్యే తెలిపారు. అలాగే వాకాడు మండలం నిడుగుర్తి నుంచి చిన్నతోట మీదుగా పంట్రంగం శివాలయం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.03 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. అనుమతులు కోసం ఆ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి తర్వలో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement