సర్కారు అనుసరిస్తున్న విధానాలవల్లే పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమలు మూత పడటానికి
సర్కారు అనుసరిస్తున్న విధానాలవల్లే పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమలు మూత పడటానికి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణం. దీనికి తోడు రాయితీలు లేకపోవడం, అంతర్జాయ మార్కెట్‌లో ఫెర్రోక్రోమ్ ధరలు తగ్గిపోవటం, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఫెర్రోక్రోమ్ ధాటికి దేశీయపరిశ్రమలు తట్టులేకపోవటం రెండో కారణంగా ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
ముడిసరకు కొరత కూడా మరో కారణంగా కనిపిస్తోంది. జూట్ పరిశ్రమలు కూడా విద్యుత్ ధరల పెంపుదల, నార కొరతవల్ల మూతపడుతున్నాయి. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టక పోవటం, ప్రభుత్వ రాయితీలు, వీటికి మార్కెట్ కల్పించక పోవటం వంటి కారణాలతో వేలాది కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉన్నవి మూతపడుతుంటే కొత్త పరిశ్రమలకోసం ప్రభుత్వభూములు కట్టబెట్టేందుకు సర్వేలు చేపట్టడం అందరినీ విస్మయపరుస్తోంది.