చిత్తూరు జిల్లా తిరుపతిలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతిలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. వీరు సోమవారం జరగనున్న ఎస్వీయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. తర్వాత కేంద్రమంత్రి జిల్లాలో నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.