కరాటేలో బంగారు పతకం

Gold Medal In Karate - Sakshi

వేటపాలెం: మండలంలోని దేశాయిపేట పంచాయతీ, రామానగర్‌లో ఉన్న వివేకా స్కూలు విద్యార్థి కరాటేలో బంగారు పతకం సాధించాడు. వివేకా స్కూలులో 6వ తరగతి చదువుతున్న ఎస్‌డీ సుభాని ఆదివారం చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కోచింగ్‌ క్యాంపులో కరాటేలో బంగారు పతకం సాధించాడు. ఈ క్యాంపులో 150 మంది విద్యార్థులు పాల్గొనగా సుభాని తన ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించాడు. సేన మార్షల్‌ ఆర్ట్స్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు కావూరి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సుభాని ఈ పోటీల్లో పాల్గొనగా నిర్వాహకులు సుభానిని అభినందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top