ఒక్క అవకాశం ఇవ్వండి: ఎస్పీ రాజశేఖరబాబు | Give it a chance: SP rajasekharababu | Sakshi
Sakshi News home page

ఒక్క అవకాశం ఇవ్వండి: ఎస్పీ రాజశేఖరబాబు

Apr 29 2015 7:38 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఒక్క అవకాశం ఇవ్వండి: ఎస్పీ రాజశేఖరబాబు - Sakshi

ఒక్క అవకాశం ఇవ్వండి: ఎస్పీ రాజశేఖరబాబు

రాజకీయ కక్షలపై ఉక్కుపాదం మోపుతానని, ఒక్క అవకాశం ఇవ్వమని అనంతపురం ఎస్పీ రాజశేఖర బాబు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను, నేతలను కోరారు.

అనంతపురం: రాజకీయ కక్షలపై ఉక్కుపాదం మోపుతానని, ఒక్క అవకాశం ఇవ్వమని అనంతపురం ఎస్పీ రాజశేఖర బాబు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను, నేతలను కోరారు.  అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ ఉదయం హత్యకు గురైన  వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి మృతదేహంతో ఆ పార్టీ నేతలు ఎస్పీ కార్యాలయం వద్ద  ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. మృతదేహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండు గంటలపాటు అక్కడే బైఠాయించారు.

ఈ హత్యపై ఎస్పీ రాజశేఖర బాబు వివరణ ఇవ్వడంతో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన విరమించారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. నేరస్తులను పట్టుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement