ప్రేమ పేరుతో వంచన | girlfriend Attempted to commit suicide To Boyfriend Cheating | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచన

Dec 2 2018 11:06 AM | Updated on Dec 2 2018 11:06 AM

girlfriend Attempted to commit suicide To Boyfriend Cheating - Sakshi

నువ్వంటే ఇష్టమన్నాడు. నువ్వులేనిదే లేనన్నాడు. పెళ్లిపేరుతో లొంగదీసుకున్నాడు. చివరికి తాళి కట్టమంటే పత్తాలేకుండా పోయాడు. తట్టుకోలేని బాధితురాలు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.  

ఆదోని టౌన్‌: మండల పరిధిలోని కుప్పగల్‌ గ్రామానికి చెందిన గురుస్వామి, తిప్పమ్మ కుమారుడు బోయ శ్రీనివాసులు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి మాయ మాటలకు నమ్మి సర్వం అర్పించింది. ఈ క్రమంలో గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని శ్రీనివాసుల వద్ద ప్రస్తావించి, పెళ్లి చేసుకోవాలని కోరింది. నిరాకరించడంతో కుటుంబ సభ్యులతో కలిసి అతని ఇంటికి వెళ్లగా అప్పటికే పరారయ్యాడు. చేసేదేమీ లేక వెనుదిరిగింది. మరోపక్క తల్లిదండ్రులు యువతిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది  శనివారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై పెద్దతుంబళం ఎస్‌ఐ రమేష్‌బాబును ఆరా తీయగా ప్రేమపేరుతో మోసం చేసినట్లు తన దృష్టికి వచ్చిందని, విచారించి బాధితురాలికి న్యాయం చేస్తామని తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement