మద్యం తాగించిన పెంపుడు తండ్రి.. పాప దుర్మరణం | Girl Child fed with liquor, killed by father in Guntur | Sakshi
Sakshi News home page

మద్యం తాగించిన పెంపుడు తండ్రి.. పాప దుర్మరణం

Oct 15 2013 10:56 AM | Updated on Aug 24 2018 2:33 PM

మద్యం తాగించిన పెంపుడు తండ్రి.. పాప దుర్మరణం - Sakshi

మద్యం తాగించిన పెంపుడు తండ్రి.. పాప దుర్మరణం

పెంపుడు తండ్రి మద్యం తాగించడంతో చిన్నారి చనిపోయిన ఘటనలో ఇంతవరకూ పోలీసులు ఎవ్వరినీ పట్టుకోలేకపోయారు.

పెంపుడు తండ్రి మద్యం తాగించడంతో చిన్నారి చనిపోయిన ఘటనలో ఇంతవరకూ పోలీసులు ఎవ్వరినీ పట్టుకోలేకపోయారు. గుంటూరులో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏడాదిన్నర పాపకు మద్యం తాగించిన తండ్రి ... చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు.

ఈ విషాద సంఘటన గుంటూరు నల్లచెరువులో సోమవారం చోటుచేసుకుంది. ఎవరి కన్నబిడ్డో తెలియదుగానీ .. సైదా అనే వ్యక్తి తన వద్ద ఉన్న చిన్నారిని .. సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు పెంచుకోవడానికి ఇచ్చాడు. అయితే, పండగ పూట తప్పతాగిన ఆ జంట ... బిడ్డకు కూడా కొంత మద్యం తాగించింది. దీంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయింది. ఈ సంఘటనపై పోలీసుల వైఖరి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement