ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్ | gas leak at east godavari | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ బావి వద్ద గ్యాస్ లీక్

Jun 4 2016 7:34 PM | Updated on Sep 4 2017 1:40 AM

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికరలో సెయింట్ మేరీ స్కూల్‌కు సమీపంలో ఓఎన్‌జీసీ కేవీ-4 బావి వద్ద శనివారం గ్యాస్ లీకయింది.

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికరలో సెయింట్ మేరీ స్కూల్‌కు సమీపంలో ఓఎన్‌జీసీ కేవీ-4 బావి వద్ద శనివారం గ్యాస్ లీకయింది. బావి నుంచి మోరి గ్యాస్ కలెక్షన్ స్టేషన్(జీసీఎస్)కు వెళ్లే పైపునకు బావి వద్ద పిన్‌హోల్ నుంచి పెద్దశబ్ధంతో గ్యాస్ ఎగజిమ్మింది. స్థానికులిచ్చిన సమాచారంతో జీసీఎస్ సిబ్బంది అటు బావి వద్ద, ఇటు జీసీఎస్ వద్ద పైపును మూసివేసి లీకేజీని అరికట్టారు. అనంతరం లీకేజీకి మరమ్మతులు చేపట్టారు. కాగా బావి వద్ద పైపు పాతబడి, తుప్పు పట్టినందునే పిన్‌హోల్ నుంచి గ్యాస్ ఎగజిమ్మిందని స్థానికులు అంటున్నారు. అలాంటి పైపులను మార్చి, కొత్తవి వేయూలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement