పారిపోతూ గోతిలోపడి స్మగ్లర్ మృతి | ganja seized in vishaka district, smuggler dies | Sakshi
Sakshi News home page

పారిపోతూ గోతిలోపడి స్మగ్లర్ మృతి

Mar 14 2016 12:32 PM | Updated on Oct 22 2018 1:59 PM

విజయనగరం జిల్లా పాడేరు మండలం వంతెడపల్లి అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేస్తుండగా కారులో 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

పాడేరు : విజయనగరం జిల్లా పాడేరు మండలం వంతెడపల్లి అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేస్తుండగా కారులో 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కారును వదిలేసి ఇద్దరు పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో జి.మాడుగుల మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన నూకరాజు(30) అనే యువకుడు గోతిలోపడి మృతిచెందాడు. మరో వ్యక్తి పరారయ్యాడు. కారును, 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement