విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు | Ganapathi Laddu auctioned for Rs. 12.75 lakh in visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు

Sep 9 2014 1:55 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు - Sakshi

విశాఖలో.. వినాయకుడి లడ్డూ 12.75 లక్షలు

విశాఖలో గణపతి లడ్డూ రూ.12.75 లక్షల ధర పలికింది. మాధవధార వద్ద కళింగనగర్‌లో విజయ వినాయక ఉత్సవ కమిటీ నేతృత్వంలో గణపతి ఉత్సవాలు జరిగాయి.

విశాఖపట్నం: విశాఖలో గణపతి లడ్డూ రూ.12.75 లక్షల ధర పలికింది. మాధవధార వద్ద కళింగనగర్‌లో విజయ వినాయక ఉత్సవ కమిటీ నేతృత్వంలో గణపతి ఉత్సవాలు జరిగాయి. సోమవారం 27 కిలోల లడ్డూను గణపతికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం ఈ లడ్డూకు వేలం నిర్వహించారు.

గాజువాకకు చెందిన వాడపల్లి రమాదేవి, మద్దిలపాలెం ప్రాంత వాసి దువ్వారపు భాస్కరరెడ్డి, పెందుర్తికి చెందిన కర్రి కృష్ణభార్గవ్ ముగ్గురూ కలిసి ఏకంగా వేలంలో రూ. 12.75 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. కాగా, వేలంలో వచ్చిన మొత్తాన్ని సీఎం సహాయ నిధికి, చిన్న పిల్లల గుండె శస్త్ర చికిత్సలకు ఖర్చు చేస్తామని ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లడ్డూ లక్షల రూపాయల ధర పలకడం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement