మాజీ ఎమ్మెల్యే దేముడు కన్నుమూత


విశాఖపట్నం: విశాఖ జిల్లా చింతపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేముడు అస్వస్థతతో మరణించారు. ఆయన గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.


దేముడు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో కన్నుమూశారు. సీపీఐ తరఫున ఆయన చింతపల్లి నియోజకవర్గం నుంచి 1994, 2004 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడిగా, ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దేముడు అంత్యక్రియలు మండలంలోని శరబన్నపాలెంలో జరుగనున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top