‘స్విస్‌’ ఒప్పందం ప్రజా ప్రయోజనాలకు భంగం | Former CS IYR Krishna Rao Writes Letter to CM Chandra Babu Naidu on Amaravathi | Sakshi
Sakshi News home page

‘స్విస్‌’ ఒప్పందం ప్రజా ప్రయోజనాలకు భంగం

Aug 28 2017 1:25 AM | Updated on Jul 28 2018 6:51 PM

‘స్విస్‌’ ఒప్పందం ప్రజా ప్రయోజనాలకు భంగం - Sakshi

‘స్విస్‌’ ఒప్పందం ప్రజా ప్రయోజనాలకు భంగం

అమరావతి నగర నిర్మాణానికి స్విస్‌ చాలెంజ్‌ విధానం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబుకు ప్రభుత్వ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు లేఖాస్త్రం
 
సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి స్టార్టప్‌ ఏరియా మాస్టర్‌ డెవలపర్‌గా సింగపూర్‌ కన్సార్టియంను ఎంపిక చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను (పురపాలక శాఖ జీవోఎంఎస్‌ నంబరు 179) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఆ ఉత్తర్వులను రద్దుచేసి పారదర్శకంగా, అంతర్జాతీయ పోటీ విధానం ద్వారా ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసినట్లు హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు.

అత్యంత కీలకమైన రాజధాని అమరావతి స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి మాస్టర్‌ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్‌ సింబ్రిడ్జి, సెంబ్‌కార్బ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ (సింగపూర్‌ కన్సార్టియం)ను ఎంపిక చేసిన తీరు అసంబద్ధంగా ఉందని తప్పుబట్టారు. స్విస్‌ చాలెంజ్‌ అంటే ఎవరూ పిలవకుండా ఒక పనిని మేము ఇంత మొత్తానికి చేస్తామంటూ ఏదైనా సంస్థ తమంతట తాముగా ప్రతిపాదన సమర్పించాలని, అయితే రాజధాని స్టార్టప్‌ ఏరియా మాస్టర్‌ డెవలపర్‌ ఎంపిక విషయంలో ఇలా జరగలేదని చెప్పారు. స్విస్‌ చాలెంజ్‌ విధానంలో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి ప్రతిపాదనలు కోరనున్నట్లు ప్రభుత్వమే పత్రికా ప్రకటన ఇచ్చిందని, దీనికి అనుగుణంగా సింగపూర్‌ కంపెనీలు ప్రతిపాదనలు సమర్పించాయని, ఇది కచ్చితంగా స్విస్‌ ఛాలెంజ్‌ విధి విధానాలను వక్రీకరించి దొడ్డిదారిన కంపెనీలను తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే అని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement