నోటు విలువ కోటి రూపాయలు! | foreign corrency in srivari hundi | Sakshi
Sakshi News home page

నోటు విలువ కోటి రూపాయలు!

Feb 2 2016 3:14 AM | Updated on Sep 3 2017 4:46 PM

నోటు విలువ కోటి రూపాయలు!

నోటు విలువ కోటి రూపాయలు!

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్నకు విదేశీ కరెన్సీ వెల్లువెత్తింది. సోమవారం శ్రీవారి ఆలయ హుండీల్లోని ఆదాయాన్ని లెక్కించారు.

ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్నకు విదేశీ కరెన్సీ వెల్లువెత్తింది. సోమవారం శ్రీవారి ఆలయ హుండీల్లోని ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో 11 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు లభించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు చెప్పారు. ఇందులో టర్కీ దేశానికి చెందిన 5 లక్షల లిరసీ నోటు (భారత కరెన్సీ ప్రకారం రూ.1,14,48,362.12) ఉంది. అమెరికా డాలర్లు 265, సౌదీ అరేబియన్ రియాల్స్ 730, ఖతర్ రియాల్ 1, యూఏఈ దర్హమ్స్ 60, మలేషియా రింగిట్స్ 170, కెనడా డాలర్లు 5, యూరోలు 10, సింగపూర్ డాలర్లు 7, కువైట్ దినార్ 1, నేపాల్ రూ.10 నోటు ఒకటి హుండీలో లభ్యమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement