
సాక్షి, నెల్లూరు: ప్రజారోగ్యం పణంగా పెట్టి.. యథేచ్ఛగా కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న చికెన్ సెంటర్‌పై ఆదివారం ఫుడ్ సేప్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలోని కోట మండలంలో టీడీపీ నేత జలీల్‌బాషాకు చెందిన చికెన్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. 285 కిలోల కుళ్ళిన మాంసాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ మాంసాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార నియంత్రణ మండలి అధికారులు హెచ్చరించారు.