సువర్ణముఖికి వరద.. భారీగా పంటనష్టం | floods to suvarnamukhi caused damage to croplands and villages | Sakshi
Sakshi News home page

సువర్ణముఖికి వరద.. భారీగా పంటనష్టం

Sep 20 2015 7:33 PM | Updated on Sep 3 2017 9:41 AM

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

వంగర (శ్రీకాకుళం): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి ప్రవాహం పెరగడంతో.. సువర్ణముఖి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో నది తీరంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తీరంలో ఉన్న కొప్పర, కొండచాకరపల్లి గ్రామాలకు నీటి తాకిడి పెరగడంతో.. గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు.

ఒకవేళ వరద ఇలాగే కొనసాగితే.. రాత్రి వరకు గ్రామలు నీట మునిగే ప్రమాదముందని భయపడుతున్నారు. ఇప్పటికే 300 ఎకరాలలో పంట నీటమునిగింది. వరద ఇలాగే కొనసాగితే మా పరిస్థితి ఏంటి అని గ్రామస్థులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement