చిచ్చు పెట్టిన ఫొటో

Festival Day Brothers Are Fighting  - Sakshi

తమ్ముడిపై అన్న దాడి 

సాక్షి, రాజంపేట : అన్న, తమ్ముడి మధ్య ఓ ఫొటో చిచ్చు పెట్టింది. ఈ సంఘటన శనివారం పట్టణంలోని బీఎస్‌ థియేటర్‌ సమీపాన ఉన్న ఓ ఇంటిలో చోటు చేసుకుంది. కరీముల్లా, షమీవుల్లా అన్నదమ్ముళ్లు. రంజాన్‌ను ఆ కుటుంబం సంతోషంగా జరుపుకొంది. ఇంతలోనే తమ్ముడు షమీ వుల్లా అన్న భార్య ఫొటో తీశారు. ఈ క్రమంలో అన్న కరీముల్లా అభ్యం తరం చెప్పారు. గొడవ వాతావరణం నెలకొంది. పైగా అనుమానం కలిగి ఉన్న అన్న తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన తమ్ముడిని స్థానిక పెద్దాసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ నరసింహులు మాట్లాడుతూ తమ్మునిపై అన్నకు అనుమానం ఉందని తెలిపారు. ఈ సందర్భంలో ఘర్షణ చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top