ఆస్తి కోసం తండ్రి దారుణహత్య | father nagaiah murdered by his son haribabu | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం తండ్రి దారుణహత్య

May 12 2015 8:41 AM | Updated on Oct 4 2018 8:38 PM

ఆస్తి కోసం ఓ కిరాతకుడు కన్న తండ్రినే కడతేర్చాడు.

చిలకలూరిపేట(గుంటూరు జిల్లా): ఆస్తి కోసం ఓ కిరాతకుడు కన్న తండ్రినే కడతేర్చాడు. ఈ సంఘటన మంగళవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కుక్కపల్లివారిపాలెం గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గొండ్రగుంట నాగయ్య(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఆస్తి విషయంలో కొడుకు హరిబాబు గత కొంతకాలం నుంచి తండ్రితో గొడవ పడుతుండేవాడు.

ఈ క్రమంలోనే తెల్లవారు జామున నిద్రిస్తున్న తండ్రిని తన మేడలో ఉన్న కండువాతో హరిబాబు ఉరివేసి చంపాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement