అధికారంలోకి రాగానే రైతుల కష్టాలు తీరుస్తాను. మొత్తం రుణాలు మాఫీ చేస్తాను. ఎవరూ బాధపడాల్సిన పనిలేదు.
‘అధికారంలోకి రాగానే రైతుల కష్టాలు తీరుస్తాను. మొత్తం రుణాలు మాఫీ చేస్తాను. ఎవరూ బాధపడాల్సిన పనిలేదు. మీకు అండగా నేనున్నాను అన్నాడయ్యా. ఏడాది కావస్తున్నా మాకు ఒక్కపైసా కూడా రుణమాఫీ కాలేదు. ఆఫీసుల చుట్టూ తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. కలెక్టర్ ఆఫీసులో కౌంటర్ పెట్టారని చెబితే ఉదయాన్నే ఇక్కడకొచ్చాం. బస్సుల్లేకపోయినా కష్టాలు పడి చేరుకున్నాం’ అంటూ ఆవేదన వెళ్లగక్కారు పలువురు రైతులు. వ్యవసాయ రుణాలు మాఫీకాని రైతుల కోసం కలెక్టరేట్‌లో ఏప్రిల్ 27న ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో శనివారం వరకు 1,952 దరఖాస్తులు అందాయి. సోమవారం ఒక్కరోజే 500కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
- ఫొటోలు: రియాజ్/ఏలూరు