విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmers killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Nov 10 2013 3:13 AM | Updated on Sep 2 2017 12:28 AM

పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తూర్పుజంగాలపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరవలింగం ఎరుకలయ్య (55) శుక్రవారం పొలంలో వరినారు పోశాడు.

 కొండాపురం, న్యూస్‌లైన్ : పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తూర్పుజంగాలపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరవలింగం ఎరుకలయ్య (55) శుక్రవారం పొలంలో వరినారు పోశాడు.
 
 శనివారం ఉదయం నారుమడిని చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ మోటారు వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. అయితే ఎరుకులయ్య మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు శ్రీను పొలం వద్దకు వెళ్లి చూడగా మోటారు వద్ద తండ్రి మృతి చెంది ఉండడాన్ని గుర్తించాడు.  మృతుడికి భార్య రమణమ్మ,  కుమారుడు శ్రీను ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement