అకాల వర్షంతో రైతులు విలవిల | farmers got loss due to untimely rains | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో రైతులు విలవిల

Jun 4 2014 3:00 AM | Updated on Sep 5 2018 2:25 PM

మండలంలో సోమవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులు, వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

గిద్దలూరు రూరల్, న్యూస్‌లైన్: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురుగాలులు, వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంకటాపురం, బురుజుపల్లి, దిగువమెట్ట, రాజుపేటలో రైతులు ఎక్కువగా నష్టపోయారు. వెంకటాపురానికి చెందిన పసుపు రైతులు అకాల వర్షం దెబ్బకు  పసుపు కొమ్ముల్ని రక్షించుకునేందుకు అవస్థ  పడ్డారు. గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు ఇంటి వద్ద బయట ఆరబోసిన పసుపు కొమ్ములు తడిసిపోయాయి.

దిగువమెట్ట సమీపంలోని మామిడి తోటలో ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. రాజుపేట, మిట్టమీదపల్లె గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఫలితంగా గ్రామంలోని 28 వ్యవసాయ మోటార్లకు సరఫరా నిలిచిపోయింది. గాలులకు బురుజుపల్లె వెంకటాపురం గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న విద్యుత్ స్తంభం తీగలతో సహా కిందకు ఒరిగి ప్రమాదకరంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement