అప్పు తీర్చే మార్గం కనిపించక,ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
కౌలు రైతు ఆత్మహత్య
Aug 22 2017 11:43 AM | Updated on Oct 1 2018 2:36 PM
నందిగామ: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించక, ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వెంకటరామయ్య(40) అనే రైతు మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట సాగుచేశాడు.
మిరప పంటకు గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పు తీర్చే మార్గం తెలియక మనోవేదనకు గురై పురుగుల మందు తాగి మంగళవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతులు పిట్టల్లా రాలుతున్న ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement