
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్ వర్థంతి కార్యక్రమంలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేస్తే దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్మిషన్ లేదంటూ పోలీసులు అతి చేశారు. అన్నదాన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టేబుల్స్, వాటర్ క్యాన్లను పోలీసులు లాక్కెళ్లిపోయారు. అదే సమయంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మండిపడ్డారు.
‘వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశాం. అన్నదానం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణం. నందిగామ సీఐ టిడిపి కార్యకర్తలాగ వ్యవహరిస్తున్నాడు. వైఎస్సార్ వర్ధంతికి పేదలకు అన్నదానం చేస్తే తప్పా. గతంలో టీడీపీ నేతల వర్ధంతి, జయంతులకు మేం ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అన్నా క్యాంటీన్‌ను కూడా గాంధీసెంటర్ లోనే ఏర్పాటు చేశారు..మేం అడ్డు చెప్పలేదుటిడిపి నేతలు పిచ్చెక్కి కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.