రుణమాఫీ కాలేదని ఆగిన రైతు గుండె | farmer heart attack | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కాలేదని ఆగిన రైతు గుండె

Feb 4 2015 3:29 AM | Updated on Jun 1 2018 8:52 PM

రుణమాఫీ కాలేదన్న దిగులుతో రైతు గుండె ఆగింది. అనంతపురం జిల్లా ఇప్పేరుకు చెందిన రైతు గోపాల్(50)కు ఐదెకరాల పొలముంది.

కూడేరు: రుణమాఫీ కాలేదన్న దిగులుతో రైతు గుండె ఆగింది. అనంతపురం జిల్లా ఇప్పేరుకు చెందిన రైతు గోపాల్(50)కు ఐదెకరాల పొలముంది. సొసైటీ బ్యాంక్‌లో రూ.35 వేలు, స్టేట్‌బ్యాంక్‌లో బంగారం తాకట్టుపెట్టి రూ. 75 వేలు తీసుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు.
 
  పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డులో ఇంటి పేరు వేర్వేరుగా ఉండడంతో మాఫీ వర్తించలేదు. పేరు మార్పు కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదు. దీంతో రుణమాఫీ వర్తించదన్న మనోవేదనతో సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement